Delhi: విద్యార్థులకు షాక్.. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
- పాఠశాల విద్యార్థులకు షాక్
- నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
- ఇకపై 5, 8 తరగతులు పాస్ కావాల్సిందే
- లేదంటే అదే తరగతుల్లో ఉండాల్సి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని తాజాగా కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది. అంటే తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒక వేళ ఫెయిల్ అయితే రెండు నెలల వ్యవధిలో ఉపాధ్యాయుల చేత మంచిగా పాఠాలు నేర్పించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మళ్లీ ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చోబెట్టాలి. అంతే తప్ప స్కూల్ నుంచి పంపించకూడదు.
సహజంగా తొమ్మిది తరగతి వరకు హాజరు కారణంగా పై తరగతులకు ప్రమోట్ అయిపోతుంటారు. కేవలం పబ్లిక్ ఎగ్జామ్‌లో మాత్రమే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుంటుంది. కానీ ఇప్పుడైతే 5 నుంచి 8 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్స్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చాల్సిందే. లేదంటే.. అదే తరగతిలో కూర్చోవల్సి ఉంటుంది. నో డిటెన్షన్ రద్దుతో విద్యార్థులకు కొత్త చిక్కులు వచ్చినట్లైంది.
Also Read
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
2019లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేసిన తర్వాత కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నో డిటెన్షన్ విధానం అమలవుతుంది. ఫెయిల్ విద్యార్థులకు రెండు నెలల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వారికి అదనపు కోచింగ్ ఇచ్చి మెరుగుపరుస్తుంటారు. పాస్ అయితే పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. లేదంటే 5, 8 తరగతుల్లోనే కూర్చోబెడతారు. అయితే చదువు పూర్తయ్యే వరకు ఏ చిన్నారిని బహిష్కరించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ విధానం కేవలం కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యాల విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3,000 పాఠశాలలకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని సీనియర్ విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!