Rahul Gandhi: మా బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- రాబర్ట్ వాద్రా ఈడీ విచారణపై స్పందించిన రాహుల్ గాంధీ..
- గుర్గావ్ ల్యాండ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్..
- తన బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- మా బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకకు నేను అండగా ఉంటాను: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. 2008లో గుర్గావ్‌లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తుంది. అయితే, ఈ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు చార్జ్‌షీట్ లో ప్రస్తావించింది. ఇక, ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపు చెక్కులను మరో కంపెనీ అయిన స్కైలైట్ రియాల్టీ ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కాగా, ఈ రెండు సంస్థలకూ రాబర్ట్ వాద్రానే యజమానిగా ఉన్నారని పేర్కొంది.
Read Also: Rishabh Pant: మరో 40 పరుగులే.. నంబర్-1 బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్న పంత్!
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
ఇక, సేల్ డీడ్ నమోదైన సమయంలో స్కైలైట్ హాస్పిటాలిటీ అకౌంట్‌లో కేవలం రూ.1 లక్ష నగదు మాత్రమే ఉండగా, రూ.7.5 కోట్ల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేసిందన్న అనుమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసింది. అంతేకాక, ఈ భూమిని మరుసటి రోజే స్కైలైట్ హాస్పిటాలిటీ పేరుపైకి మార్చారని తెలిపింది. సాధారణంగా భూమి టైటిల్ బదిలీ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది.. కానీ, ఈ వ్యవహారంలో 24 గంటల్లోనే ఆస్తి పేరు మారడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చింది.
Read Also: Felix Baumgartner: సూపర్‌సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ కన్నుమూత
ఇక, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు. బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకతో పాటు వారి పిల్లలుకు తన అండగా ఉంటాను అని పేర్కొన్నారు. మా బావపై జరుగుతున్న కుట్రలు రాజకీయంగా ప్రేరేపించబడినవి మాత్రమే అన్నారు. ఈ వేధింపులను తట్టుకోవడానికి నేను వారికి మద్దతుగా నిలుస్తాను అని వెల్లడించారు. వారందరూ ఎలాంటి హింసనైనా తట్టుకునేంత ధైర్యంగా ఉన్నారని నాకు తెలుసు.. చివరికి నిజమే గెలుస్తుంది అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
My brother-in-law has been hounded by this government for the last ten years. This latest chargesheet is a continuation of that witch hunt.
I stand with Robert, Priyanka and their children as they face yet another onslaught of malicious, politically motivated slander and…
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2025
- Tags
- bjp
- Centre Govt
- congress
- NDA
- PM Modi
తాజావార్తలు
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!