Manipur: మణిపూర్‌లో హింస.. నేడు ఢిల్లీలో మైతీ-కుకి, నాగా నేతలతో కేంద్రం కీలక చర్చలు..
- మణిపూర్‌లో కొనసాగుతున్న హింస..
- నేడు మైతీ- కుకి- నాగా నేతలతో కేంద్ర హోంశాఖ కీలక చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న జాతి వివాదానికి పరిష్కారం కనుగొని శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు (మంగళవారం) న్యూ ఢిల్లీలో మైతీ, కుకీ మరియు నాగా కమ్యూనిటీలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏడాది కాలంగా కొనసాగుతున్న హింసాకాండకు స్వస్తి పలికేందుకు తొలిసారిగా ఈ మీటింగ్ కు పిలుపునిచ్చారు. కాగా, దేశ రాజధానిలో జరగనున్న ఈ సమావేశానికి ముగ్గురు నాగా ఎమ్మెల్యేలు అవాంగ్‌బౌ న్యూమై, ఎల్. డికో, రామ్ ముయివా హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) సభ్యులు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
అయితే, మైతీ, కుకీ వర్గాలకు చెందిన ఎంత మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరవుతారనేది ఇంకా స్పష్టంగా తెలపలేదు. వివాదంలో ఉన్న వర్గాల మధ్య చర్చలు ప్రారంభించి సంక్షోభానికి పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు కొనసాగనుంది. ఈ చర్చలకు హాజరయ్యే నాగా, కుకీ, మైతీ ఎమ్మెల్యేలందరినీ హోం మంత్రిత్వ శాఖ వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు ఇంఫాల్‌లోని స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే కొంతమంది మైతీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ సభ్యులు కూడా న్యూఢిల్లీకి బయలుదేరారని పేర్కొనింది.
Read Also: Karunakaran : ఇన్నాళ్లకు ఓ అవకాశాన్ని దక్కించుకున్న తొలిప్రేమ దర్శకుడు
హింసలో ఇప్పటి వరకు 200 మంది చనిపోయారు
2023 మేలో మణిపూర్‌లో చెలరేగిన జాతి వివాదంలో ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు. అలాగే, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలతో సంయుక్త ఆపరేషన్‌లో సైన్యం మణిపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. దీంతో పాటు అక్టోబర్ 7న బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో ఒక కార్బైన్ మెషీన్, ఒక ఏకే-47 రైఫిల్, 12 బోర్ సింగిల్ బ్యారెల్ రైఫిల్, 12 బోర్ పిస్టల్, 2.5 కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ), మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్‌లు, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!