ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నాయి సెంట్రల్ టీమ్స్.. రాగానే మొదట.. రాష్ట్ర అధికారులతో సమావేశమై.. వరదల తీవ్రత.. నష్టంపై చర్చించారు.. దాదాపు రెండు గంటల పాటు ఏపీ అధికారులతో సమావేశమైంది కేంద్ర బృందం. ఇక, కాసేపట్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో సెంట్రల్ టీమ్స్ పర్యటించనుండగా..…
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తుఫాన్ , కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు భేటీ అయ్యాయి. సీఎంతో తుఫాన్, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు సమావేశమై.. క్షేత్ర స్థాయిలో తాము గుర్తించిన అంశాలపై చర్చించారు.
మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.
రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు.
Medigadda Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడంతో కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ అధ్యక్షతన ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది.