Central Team: ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు. దీంతో ఏపీలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీలో పర్యటించింది. రెండురోజుల పాటు ఏపీలో కేంద్ర పర్యటిస్తోంది. మిచౌంగ్ తుఫాన్‌తో జరిగిన పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనా వేస్తోంది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరులో పర్యటించింది కేంద్ర బృందం. తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. పంట నష్టం పరిహారంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి అందిస్తామన్నారు కేంద్ర అధికారులు.
Read Also: CM YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పరట్యన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
అంతకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు కేంద్ర బృందం సభ్యులు. మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. మరోవైపు కర్నూలు జిల్లాలో వర్షాలు లేక నష్టపోయిన పంటలను కూడా పరిశీలించింది కేంద్ర బృందం. కర్నూలు జిల్లా ఆస్పరిలో పర్యటించి.. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరా పొలానికి 30 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నామని.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు అధికారుల ముందు వాపోయారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించి క్షేత్ర స్థాయిలో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆపై కేంద్రం ఏపీలో జరిగిన పంట నష్టంపై నివేదిక ఆధారంగా పరిస్థితిని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.