Central Team: ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు రానుంది కేంద్ర బృందం.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం.. ముందుగా ఈ రోజు ఇవాళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరుతో భేటీకానుంది.. ఇక, ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించనున్నారు కేంద్ర బృందంలోని అధికారులు.. క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు.. తుఫాన్‌తో జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుంచి సమాచారం సేకరించనుంది సెంట్రల్ టీమ్.
Read Also: CM Mamata Banerjee : బెంగాల్ దేశాన్ని నడిపిస్తుంది : సీఎం మమతా బెనర్జీ
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం విదితమే.. తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు రైతులు.. దీంతో, నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీలో రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి.. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. మరోవైపు.. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఇవాళ, రేపుకేంద్ర బృందం పర్యటించబోతోంది.. ఈ బృందం జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయనుంది.. పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఆలూరు, దేవనకొండ, కోడుమూరు మండలాల్లోని పలు గ్రామాల్లో సెంట్రల్ టీమ్ పర్యటన కొనసాగనుండగా.. సాయంత్రం కర్నూలు కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ తలికించి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక, రేపు నంద్యాల జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగనుంది.