Telangana: సీఎస్ శాంతికుమారితో కేంద్ర బృందం భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుంచి మూడో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు నేడు సీఎస్‌తో సమావేశమయ్యారు.
Also Read: Madhu yaskhi Goud: తెలంగాణ నినాదంతో పదేళ్లుగా కేసీఆర్ దోపిడీ పాలన
Also Read
ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటితో పాటు వరి పంటతో పాటు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైందని తాము పరిశీలించినట్టు వివరించారు.
Also Read: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు
ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీటమునిగి ఆస్తి నష్టం కలిగాయని అన్నారు. అయితే, ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముంగుజాగ్రత్త చర్యల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించారని పేర్కొన్నారు. కాగా, విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలించగలమని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!