యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద జోషి దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
Indian Musical Instruments Exports: ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ప్రథమార్ధంలో మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు 3.5 రెట్లకు పైగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ 172 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాదాపు పదేళ్ల కిందట.. అంటే.. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్‌లోని ఇదే సమయంలో ఈ ఎగుమతుల విలువ కేవలం 49 కోట్ల రూపాయలేనని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్‌లో తెలిపారు.
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని..…
Google Gift to India: మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'ఇండియా కీ ఉదాన్' అనే ఆన్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించింది.
Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె.కరాడ్ రాతపూర్వకంగా తెలిపారు.