హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్యే వుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అన్నారు. ఏడేళ్ళుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికి మహద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, రాణేను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా,…
నిన్నటి రోజున తిరుపతిలో జన ఆశీర్వాదసభకు హాజరైన కిషన్ రెడ్డి ఆ సభ తరువాత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం కిషన్ రెడ్డి విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం చేసుకొని కారు ఎక్కుతుండగా కారు డోర్ తగలడంతో ఆయన తలకు స్వల్పగాయం అయింది. స్వల్పమైన గాయమేనని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు పేర్కొన్నారు.…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు…
కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం మే, జూన్ మాసాలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది. ప్రజల అవసరాల మేరకు అవసరమైతే పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. భాజపా అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు సేవా హి సంఘటన పేరుతో పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. దేశ వ్యాప్తంగా మాస్కులు, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని…