విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.
ఈ సంవత్సరం జూన్ నాటికి 87 వేల 26 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దీంతో 2011 నుంచి ఇప్పటి వరకు 17.50 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి లిఖితపూర్వక ఆన్సర్ ఇచ్చారు. కాగా, 2020 నుంచి ఇప్పటి వరకు 5లక్షల 61వేల 272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశంలో అభివృద్ధి జరగాలంచే డబులు ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
India's Services Exports: మన దేశంలో సేవల రంగం పనితీరు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని దాటేస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ ఇండియా సర్వీస్ ఎక్స్‌పోర్ట్‌లు 300 బిలియన్ డాలర్ల టార్గెట్‌ను క్రాస్ చేయనున్నాయని తెలిపింది. ఈ మేరకు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో దాదాపు 20 శాతం గ్రోత్ నమోదు చేస్తామని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖల…
Andhra Pradesh: కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని.. ప్రస్తుతం ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదని విమర్శలు చేశారు. గ్రామీణాభివృద్ధికి 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను ప్రభుత్వం వేరే…
India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.
Drinking Alcohol: ఆల్కహాల్‌కు బానిసైన వాళ్లు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అటు కొంతమంది కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి అమ్మాయిలను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని చెప్పారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన…