తెలంగాణలో అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణలో డబుల్ ఇంజన్ పాలన రాబోతుందన్నారు కేంద్ర సహకారశాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ. తెలంగాణ పర్యటనలో ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి డబల్ ఇంజన్ తరహా పాలన రాబోతుందన్నారు కేంద్రమంత్రి బి ఎల్ వర్మ. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారంలో బిజెపి ఆత్మీయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో గ్యాంగ్ స్టర్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా ఖర్చుకావడం లేదన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధిపై సమాచారాన్ని సేకరించేందుకు తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. తన పర్యటనలో ప్రధానమంత్రి మోడీ పాలన గురించి ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పారు . ఈ సందర్భంగా గ్రామంలోని ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.తొలుత మల్లారంలో కేంద్ర మంత్రికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిస్థాన్ మోర్చా నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , బీజేపీపార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also:Minister KTR: మరోసారి కరోనా బారిన పడ్డ కేటీఆర్