Nirmala Sitaraman: కూరగాయల మార్కెట్లో కేంద్ర మంత్రి.. జీఎస్టీ వేస్తారేమోనంటూ కామెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitaraman: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ… ప్రజలకు నిత్యావసర సరుకులైన కూరగాయలపై కేంద్రమంత్రి దృష్టి పెట్టినట్లున్నారని కొంతమంది అంటుండగా… నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లినట్లున్నారని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
ఓ కేంద్ర మంత్రి స్వయంగా కూరగాయలు కొనేందుకు మార్కెట్ రావడంతో స్థానికులు ఆమెతో మాట్లాడేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోను నిర్మలా సీతారామన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం ఆమె తమిళనాడు రాజధాని చెన్నైకు వెళ్లారు. చెన్నైకు చేరుకున్న ఆమె అక్కడ మైలాపూర్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌కు వెళ్లి.. పలు రకాల కూరగాలను కొనుగోలు చేశారు. కూరగాయల ధరల వివరాలను తెలుసుకుని, ఆమె స్వయంగా కూరగాయలు ఎలా ఉన్నాయో పరిశీలించి మరీ వాటిని కొనుగోలు చేశారు.
అనంతరం నిర్మలా సీతారామన్ అక్కడే ఉన్న కూరగాయల వ్యాపారులతో, స్థానిక ప్రజలతో మాట్లాడారు. నిజానికి ధరల పెరుగుదల విషయంలో ఆర్థిక మంత్రిని, కేంద్రాన్ని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
Read Also: MBBS in Hindi: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం
మరోవైపు సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పోస్టులకు మిశ్రమ స్పందన వస్తోంది. పెరిగిన ధరలను తెలుసుకునేందుకు వెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. ఓ ఆర్థిక మంత్రే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నింటి పైనా జీఎస్టీ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తూ బాదుతున్న కేంద్ర ఆర్దిక శాఖ..ఇప్పుడు కూరగాయల పైనా జీఎస్టీ విధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని ఆహార పదార్దాల పై జీఎస్టి విధించిటం..తరువాత నిర్ణయంలో మార్పులు చేయటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
తాజావార్తలు
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!