Union Minister of Commerce and Industry, Consumer Affairs, Food and Public Distribution, Textiles Piyush Goyal has been reappointed as a leader of the house in the Rajya Sabha.
బీజేపీ సీనియర్ నేత, మైనారిటీ విభాగంలోని కీలక నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆయన పదవీకాలం రేపటితో అయిపోతుంది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ షుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి మాండవీయ. గుంకళాంలో ఇళ్ల నిర్మాణం, గొట్లాంలో నాడు- నేడు కార్యక్రమంలో నవీకరించిన పాఠశాలను, కుమిలిలో రైతు భరోసా కేంద్రాన్ని, ఎం.డి.యు. నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి. అలాగే, జిల్లా కేంద్ర ఆసుపత్రిని, రామతీర్థంలో ఆలయాన్ని సందర్శించనున్నారు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ. దేశంలో…
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా…
దేశంలో రూ.10 నాణేలు వాడుకలో ఉన్నా వ్యాపారులు వీటిని స్వీకరించడంలేదు. దీంతో ఈ నాణేలను కలిగి ఉన్న వారు గందరగోళానికి గురవుతున్నారు. ఏదైనా కొనుగోలు నిమిత్తం రూ.10 నాణేలను తీసుకువెళ్తే వ్యాపారులు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రూ.10 నాణేల అంశం మంగళవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రూ.10 నాణేం చెల్లుతుందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ఎంపీ ప్రశ్నించారు. Read Also: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నోట ‘పుష్ప’ డైలాగ్…
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్…
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలోనూ రైల్వేల…
దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు…