India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.
ఇప్పుడు 12 కోట్ల టన్నులను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. మరో 8 ఏళ్లలో మళ్లీ రెట్టింపు స్థాయికి చేరుకోవాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. 2030 నాటికి.. ఈ 12 కోట్ల టన్నుల స్టీల్ ప్రొడక్షన్ లెవల్ నుంచి 30 కోట్ల టన్నులకి ఎదగాలని ఆశిస్తోంది. గత 8 ఏళ్లలో ఉక్కు ఉత్పత్తి డబుల్ అయింది కాబట్టే ఇండియా రెండో ర్యాంకును పొందగలిగింది. స్టీల్ కెపాసిటీ విషయానికొస్తే.. అప్పట్లో మన దగ్గర కేవలం ఏడున్నర కోట్ల టన్నుల ఉక్కు మాత్రమే స్టాక్ ఉండేది.
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
read also: Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‘ పవన్ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ
ఇప్పుడు 15 పాయింట్ 4 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో స్టీల్ ప్రొడక్షన్‌కి సంబంధించి అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నందున ఈ దశాబ్దం చివరి నాటికి మన స్టాక్ కెపాసిటీ 15 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు ఈజీగా చేరుకోగలం. ఈ లక్ష్య ఛేదనలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సెయిల్.. మరియు బొకారా స్టీల్ ప్లాంట్ కూడా భాగస్వాములు కానున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వివరించారు.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!