మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిటీ యొక్క తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, చండీగఢ్‌లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు.
Harish Rao: ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజికావర్గం పరిధిలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి భారీ చేరికలు జరిగాయి.
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)ల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమాచార హక్కు చట్టం, 2005 ‘మృతపత్రం’గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
డిసెంబర్ 5 వరకు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తమ ప్రతిపాదిత ‘విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర’ చేపట్టవద్దని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు.
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది.