Harish Rao: ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజికావర్గం పరిధిలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి భారీ చేరికలు జరిగాయి. సుమారు రెండు వేల మంది వివిధ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి లో ఉన్నత విద్యావంతుడు మంచి మనిషి అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలను తన డబ్బుతో, గుడాయిజంతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేవాడని విజ్ఞత లేని రాజకీయాలు చేశాడని తాము ఆయన లాగా వ్యవహరించలేదని రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మైనంపల్లి ని అద్దేశించి అన్నారు.
ఈసారి భారీ మెజారిటీతో బి.ఆర్.ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ని గెలిపిస్తే తాను మల్కాజిగిరి నియోజికవర్గాన్ని దత్తత తీసుకుంటానని తాను ప్రతీ నెలా ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలపై ప్రధాన దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పథకాలను బీజేపీ కాఫీ కొట్టిందని మండిపడ్డారు. మంచినీటి సమస్యను తీర్చామన్నారు. బిల్లు లేకుండా ఉచితంగా నీరు ఇస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు వంద పడకల ఆస్పత్రి ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలో గల్లీకో పేకాట క్లబ్బు ఉండేదని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులన్నీ మూసేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వద్దు, పేకాట క్లబ్బులు వద్దు అని మంత్రి తెలిపారు.
Vellampalli Srinivas: ఆర్థికంగా ఏపీ బలోపేతం కావడానికి కారణం సీఎం జగనే..