కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో ఇద్దరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అందులో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఉన్నారు. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది.
న్యూఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు మార్చాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై 'అయోధ్య మార్గ్' అనే స్టిక్కర్ అంటించారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న స్టూడెంట్స్ ను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని స్పష్టం చేసింది.
కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొప్రా ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ. 300 పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.10860 నుంచి రూ.11160కి పెరిగింది. మరోవైపు.. బాల్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.11750 నుంచి రూ.12000కి పెంచారు. పెంచిన ధరల ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈరోజు జరిగిన సమావేశంలో.. బీహార్‌లోని దిఘా నుండి సోన్‌పూర్ మధ్య గంగా…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన…
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ నగరం కుంగిపోయిన వార్త దేశంలో, ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జోషిమఠ్‌లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు.