సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. అమరావతిని రాజధాని అంశం కొర్టు పరిధిలో ఉంది.. అభివృద్ది అవకాశాలు ఉన్నా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం.. వేల సంఖ్యలో మత్స్యకారులు వలసలు ఉన్నాయి.. రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాకారంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుక బాటుకు పొలిటికల్ పార్టీలే కారణం అని ఆయన ఆరోపించారు. బీజేపీ నుంచి యాక్సన్ ఉత్తరాంధ్ర అనే ప్రణాళికను చూస్తారు.. విశాఖ పట్నం కేంద్రంగా గ్రోత్ హాబ్ గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెల్లిన 27 కులాలను బీసీల జాబితా నుంచి తెలంగాణలో తొలగించారు.. ఈ అంశాన్ని కేంద్ర ప్రభఉత్వం దృష్టికి తీసుకుపోయామని ఆయన అన్నారు. తర్వాలోనే మంచి ఫలితం వస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.