రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా బీజేపీ నేతలు గవర్నర్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిత్యం పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వచ్చే యాసంగిలో వరి తీసుకోకుండా చేశారు…మా వరిని తీసుకునే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామన్నారు.
రైతుల నుంచి వరి ధాన్యం తీసుకోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. వరి ధాన్యం సేకరించే కేంద్ర సర్కారుకే పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. 51 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరును టీఆర్‌ఎస్ సర్కార్ అందించిందన్నారు. 26 లక్షల వ్యవసాయ మోటర్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గిందన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన 66 వేల123కి రైతు భీమా రూపంలో సాయాన్ని అందించామన్నారు.
ఎల్‌ఐసీని కేంద్రం ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ హయాంలో ప్రగతి కనిపించడంలేదా అంటూ ప్రతిపక్షాలపై ఆయన విరుచుకు పడ్డారు. దేశంలో తెలంగాణలో వ్యవసాయ రంగం గొప్ప ప్రగతిని సాధించిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పై విమర్శల దాడులకు దిగారు. రేవంత్ రెడ్డి వాడో పిచ్చోడన్నారు. దేశంలో కాంగ్రెస్ ఉన్నదిలేదు. సచ్చింది లేదన్నారు. సీఎం స్టాలిన్ పిలిస్తే … కేసీఆర్ వెళ్లి కలుస్తారు ఎన్డీఏ సర్కార్ దిగిపోయే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. బీజేపీ పై పోరాటం విషయంలో పోరాడే శక్తులతో సమయానుసారం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.