ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై చట్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్‌ను, విద్యావిధానాన్ని కూడా మార్చేసింది.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేసింది.. ఈ సమయంలో.. ఐటీ కంపెనీలతో పాటు.. చిన్న సంస్థలు కూడా కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.. కరోనా కేసులు తగ్గి కొంత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఐటీ కంపెనీలు ఇంకా వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగిస్తూనే ఉన్నాయి.. అయితే, ఆ పేరుతో కంపెనీలు ఉద్యోగులను పిండేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఎలాగు ఇంటి దగ్గరే కదా ఉన్నారని.. ఎక్కువ గంటలు పనిచేయించడం ఒకటైతే.. మరోవైపు.. వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.. తప్పితే.. వారికి అవసరమైన కనీస వసతులు కూడా కలిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక నిఘా..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దీంతో.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిబంధనలు రూపొందించేపనిలో పడిపోయింది కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ఈ నిబంధనల్లో కచ్చితమైన పని గంటలను నిర్ణయించి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఉద్యోగులకు విద్యుత్తు, ఇంటర్నెట్, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్/ఫర్నిచర్‌కు కూడా సంబంధిత కంపెనీలు డబ్బులు చెల్లించేలా నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది కేంద్రం.. ఇక, చట్టంలో ఉండాల్సిన అంశాలను, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల మదింపు విధానాలను అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్. కాగా, కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు కావాల్సిన ఫర్నిచర్, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.. అవి ఏవీ కల్పించకుండా.. ఉద్యోగులను పిండేస్తున్న సంస్థల నియంత్రణకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!