నీట్ పీజీ సీట్ల భర్తీలో భారత వైద్య మండలి వ్యవహరించిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని ప్రశ్నించింది. విద్యార్థుల భవితతో ఆటలాడుతున్నారా? అని మండిపడింది.
కాగా నీట్-పీజీ 2021-22కి సంబంధించి ఖాళీగా 1,456 మెడికల్ పీజీ సీట్ల కోసం ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఏడుగురు వైద్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఎమ్‌ఆర్ షా, అనిరుద్ద బోస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిగిపింది. ఈ సందర్భంగా సీట్లు పూర్తిగా భర్తీ కాకపోతే మాప్‌ఆప్ రౌండ్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక్క మెడికల్ సీటు ఖాళీగా ఉన్నా దానిని భర్తీ చేయాలని సూచించింది.
Nupur Sharma Controversy: ఆత్మాహుది దాడులు చేస్తామంటూ అల్‌ఖైదా వార్నింగ్
దేశానికి వైద్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు చాలా అవసరమని గుర్తు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా వారి జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకున్నందుకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. మిగిలిపోయిన సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ 24 గంటల్లో కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ గురువారం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.