Nitin Gadkari: రాంగ్ పార్కింగ్‌పై కఠిన చట్టం.. ఫోటో పంపితే రూ.500 రివార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వాహనాల పార్కింగ్ సమస్యలపై ప్రసంగించారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. రాంగ్ పార్కింగ్‌తో తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయని.. రాంగ్ పార్కింగ్‌కు తప్పనిసరిగా అడ్డుకట్ట వేస్తామన్నారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫోటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డుగా ఇస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
Nupur Sharma: నా అడ్రస్ తెలుపొద్దు.. మీడియాకు నుపుర్ రిక్వెస్ట్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!