Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా విశాఖలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 8 బయో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు…
National Clean Air Programme: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని పట్ణాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన అశ్వినీకుమార్ చౌబే.. 15వ ఆర్థిక సంఘం…
Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్‌బీఐనే రూ.1,64,735 కోట్ల…
Central Government: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని..…
Pan-Aadhar Linkage: మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని పన్నుచెల్లింపుదారులను ఆదాయపు పన్నుశాఖ కోరింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. తాజాగా పాన్, ఆధార్ లింకేజీ ప్రక్రియకు 2023 మార్చి 31వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా…
National Wise Pending Cases: దేశంలోని అన్ని కోర్టుల్లో రోజురోజుకు పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్ కోడ్ కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2023 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బార్ కోడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అడ్రస్ తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీ వివరాలను కంపెనీలు పేర్కొనాల్సి ఉంటుంది.…
మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్స్టర్లు, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయడం లేదా కంటెంట్‌ను ప్రసారం చేయకుండా ఎఫ్ఎం రేడియో ఛానెళ్లను కేంద్రం హెచ్చరించింది.
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. డిసెంబర్ 1,2022 నుంచి నవంబర్ 30,2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్లో డిసెంబర్…