Egg Export: ప్రస్తుతం కోడిగుడ్ల పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. నమక్కల్ ప్రాంతం కోడిగుడ్ల ఎగుమతికి ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోని కోళ్లకు వ్యాధి రహిత ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. 40 రోజులుగా నమక్కల్ ప్రాంతం నుండి గుడ్ల ఎగుమతి నిలిచిపోయిందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
నమక్కల్‌లో ఆల్ ఇండియా ఎగ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సంప్రదింపుల సమావేశం ఇటీవల జరిగింది. ప్రస్తుతం గుడ్ల ఎగుమతి పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఇది గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది.. మొత్తం భారతదేశంలో గుడ్డు ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది. నమక్కల్ జిల్లాలో 1000కు పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ ఫారాల్లో ఉత్పత్తి చేయబడిన గుడ్లు బాగ్దాతి, మస్కట్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సైబీరియా, దుబాయ్, సిరియా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు వంటి దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఈ దేశాలకు నెలకు 150 కంటైనర్ల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి.
Read Also: Bad Mood : మీ మూడ్ బాగోట్లేదా.. అయితే రోజూ ఇలా చేయండి
ఇప్పుడు తొలిసారిగా గతేడాది డిసెంబరు 13 నుంచి భారత్ నుంచి ముఖ్యంగా నమక్కల్ ప్రాంతం నుంచి మలేషియాకు గుడ్లు ఎగుమతి అయ్యాయి. మలేషియాలో గుడ్లు ఉత్పత్తి అవుతున్నప్పటికీ, డిమాండ్ , వినియోగం పెరిగింది. దీంతో నామక్కల్ ప్రాంతాల నుంచి గుడ్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. మలేషియా తొలిసారిగా భారత్ నుంచి పెద్ద మొత్తంలో గుడ్లను దిగుమతి చేసుకుంటోంది. అలాగే, మలేషియాకు భారత్ గుడ్డు ఎగుమతులు 2023 మొదటి అర్ధభాగంలో మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలు భారత్ ముఖ్యంగా నమక్కల్ నుండి గుడ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
ఆల్ ఇండియా గుడ్ల ఎగుమతిదారుల సంఘం కార్యదర్శి వల్సన్ పరమేశ్వరన్ మాట్లాడుతూ:-
గత డిసెంబర్‌లో నమక్కల్ ప్రాంతంలోని ఫారాల నుంచి 10 కంటైనర్లలో తొలిసారిగా 50 లక్షల గుడ్లు మలేషియాకు ఎగుమతి అయ్యాయి. వరుసగా ఆర్డర్లు వస్తున్నాయి. నమక్కల్ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు నాణ్యతతో పాటు బరువు ఉండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో గుడ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. భారత గుడ్ల దిగుమతిపై మలేషియా ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. చికెన్ కలరా, సాల్మొనెల్లా బాక్టీరియా, ఎన్టీ వ్యాధి లేని మూడు రకాల వ్యాధి రహిత సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తేనే గుడ్లు దిగుమతి చేసుకోవచ్చని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Phone In Toilet: టాయిలెట్లో ఫోన్ చూస్తే.. తప్పకుండా మీరక్కడికే
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో గత 40 రోజులుగా భారత్ నుంచి మలేషియాకు గుడ్ల ఎగుమతిపై ప్రభావం పడింది. కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఈ సర్టిఫికెట్లను వీలైనంత త్వరగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. అందజేస్తే ప్రతి నెలా నమక్కల్ ప్రాంతం నుంచి మలేషియాకు దాదాపు 50 కంటైనర్ల గుడ్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.