Centre likely to hike dearness allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం. మరోసారి ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంచే అవకాశం ఉంది. త్వరలోనే మరో 4 శాతం డీఏను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 38శాతం డీఏ ఉంది. దీన్ని 42 శాతానికి పెంచనున్నారు. ప్రతి నెలా లేబర్ బ్యూరో పారిశ్రామిక కార్మికుల కోసం విడుదల చేసే వినియోగదారుల ధరల సూచిక(CPI-IW) ఆధారంగా డీఏను పెంచనుంది. గతేడాది డిసెంబర్ నెలకు 4.3 డీఏగా లెక్క కట్టారు. దీని ఆధారంగా మరో 4 శాతం డీఏ పెంచే అవకాశం ఏర్పడింది. దీని ద్వారా కోటికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Read Also: Naftali Bennett: జెలన్ స్కీని చంపనని పుతిన్ ప్రామిస్ చేశాడు.. ఇజ్రాయిల్ మాజీ పీఎం
ఆర్థిక శాఖ ఈ ప్రతిపానను కేంద్ర మంత్రి మండలి ముందు ఉంచనుంది. ఒక వేళ క్యాబినెట్ ఆమోదం తెలిపితే జనవరి 1, 2023 నుంచి ఉద్యోగులకు కొత్త డీఏ అమలులోకి వస్తుంది. గత ఏడాది చివరిసారిగా సెప్టెంబర్ 28వ తేదీ 2022న డీఏను కేంద్ర పెంచింది. జూలై 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా కేంద్రం డీఏను పెంచుతుంది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఏడాదికి రెండు సార్ల డీఏను పెంచుతారు. గ్రామీణ ప్రాంత, పట్టణ ప్రాంత ఉద్యోగుల డీఏలో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంత ఉద్యోగుల కన్నా పట్టణ ప్రాంత ఉద్యోగులకు డీఏ ఎక్కువగా ఉంటుంది.