Rice Export: ఆ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Export To Singapore: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవోల్బణాన్ని తగ్గించడం కోసం ఆహార నిల్వల పెంపుకోసమే ఇలా చేశామని అప్పట్లో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణగా భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడి డిమాండ్ భారీగా పెరిగింది. ఎగుమతులు ఆపేయడంతో విదేశాల్లో ఉంటున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచ బియ్యం రవాణాలో భారతదేశ ఎగుమతులు 40% కంటే ఎక్కువ. 2021-22లో భారత్ దాదాపు 22 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది భారత్. తాజాగా ఉప్పుడు(పారాబాయిల్డ్) బియ్యం ఎగుమతులపై కూడా 20% పన్ను విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా బాస్మతి బియ్యం ఎగుమతులపైన కూడా ఆంక్షలు విధించింది. ఇక నూక బియ్యం ఎగుమతులపై గత ఏడాదే కేంద్రం నిషేధం విధించిందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు అయ్యింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి భారతీయులు అధికంగా ఉన్న దేశాలకు కూడా ఎగుమతులు ఆపేసిన భారతదేశం సింగపూర్ కు బియ్యం ఎగుమతి చేసేందుకు మాత్రం పచ్చ జెండా ఊపింది. సింగపూర్ కు సరఫరా చేయడానికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి దానితో ఉన్న ఎన్నో ఏళ్ల స్నేహ బంధమే కారణమని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా సింగపూర్ తో భారత్ కు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Google Flights: గూగుల్ కొత్త ఫీచర్.. తక్కువ ధరకే విమాన టికెట్లు
ఇక సింగపూర్ కు బియ్యం ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. భారత్, సింగపూర్‌ల మధ్య సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. “భాగస్వామ్య ఆసక్తులు, సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఉన్న కారణంగానే సింగర్ పూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. . దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఇవి త్వరలోనే వెలువడనున్నాయి. అయితే సింగపూర్ కు ఎగుమతి చేసే బియ్యం పరిమాణంపై మాత్రం అధికారిక సమాచారం లేదు
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!