ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అదే విధంగా వచ్చే నెలలో కూడా కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.. అదే విధంగా అక్టోబర్ నెలకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. అక్టోబర్‌లో పండుగ హడావుడి కూడా ఊపందుకుంటుంది. అక్టోబర్‌లో అమలులోకి రాబోయే కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇందులో మీ డబ్బుపై ప్రభావం చూపేవి కూడా ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం పదండీ..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్ తప్పనిసరి. ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసినవారు తమ ఆధార్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆధార్ సబ్మిట్ చేయకపోతే ఈ పొదుపు పథకాల అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి…
అదే విధంగా బర్త్ సర్టిఫికెట్ లో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం అన్ని డాక్యుమెంట్లకు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్ చేయబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఆధార్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఇకపై బర్త్ సర్టిఫికెట్ కీలకం కానుంది..
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్లకు నామినీ పేర్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. సెప్టెంబర్ 30 లోగా అకౌంట్ హోల్డర్స్ నామినీ వివరాలను అప్‌డేట్ చేయాలని సెబీ గతంలోనే ఆదేశించింది.. వీటికి నామినీ పేరు యాడ్ చెయ్యకుంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని పేర్కొన్నారు..
ఇకపోతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్ తప్పనిసరి. ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసినవారు తమ ఆధార్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ.. ఆధార్ లింక్ లేకుంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది..
గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ నియమనిబంధనల్ని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. టూర్లు, స్టడీ, సెలవుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఈ ట్యాక్స్ రూల్స్ వర్తిస్తాయి. వైద్యం, విద్యాభ్యాసం కోసం 5 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. విదేశాల్లో క్రెడిట్ కార్డులతో రూ.7 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే 20 శాతం టీసీఎస్ వర్తిస్తుంది..
ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్ల సర్క్యులేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకే రూ.2000 కరెన్సీ నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్యాంకులు రూ.2000 కరెన్సీ నోట్లను తీసుకోవు.. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి షరతులు వర్తిస్తాయి..