Central Team in AP: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నిధుల పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి.. దీంతో.. కేంద్రం రంగంలోకి దిగింది.. స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టనుంది కేంద్ర బృందం.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం రేపు విచారణ చేపట్టనుంది.. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర విచారణ బృందం మంగళవారం రోజు ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కలవనుంది.. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండంలోని వరగాని గ్రామంలో పర్యటించనున్న కేంద్ర బృందం. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, బందరు మండలంలోని పెద యాదర గ్రామాల్లో పర్యటించనుంది.. కాగా, కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. దుర్వినియోగం జరుగుతోందంటూ గతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.
Read Also: Asian Games 2023: టెన్నిస్‌లో భారత్కు నిరాశ.. తొలి రౌండ్‌లోనే ఔట్