జమ్మూ కాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. జమాతే ఇస్లామీ చట్టవిరుద్ధమైన సంఘంగా గతంలోనే పరిగణించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ మంగళవారం కేంద్ర హోంశాఖ (Central government) ప్రకటన విడుదల చేసింది.
దేశం యొక్క భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఫిబ్రవరి 28, 2019న చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మరోసారి ఆ సంస్థపై నిషేధాన్ని పొడిగించింది.
జమాతే ఇస్లామీ అనేది ఒక సామాజిక, మతపరమైన సంస్థ. ఇది 1945లో స్థాపించబడింది. ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ సంస్థ భారతదేశ సమగ్రతకు భంగం కలిగించేలా కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న కారణంతో జమాతే ఇస్లామీ చీఫ్ సహా 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కూడా అదే వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోసారి ఐదేళ్ల పాటు ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది.
Ministry of Home Affairs today extended the ban on Jamaat-e-Islami, Jammu Kashmir for the next five years with immediate effect declaring it as an ‘unlawful association’. The organisation is found continuing its activities against the security, integrity and sovereignty of the… pic.twitter.com/FuB5GLszJ6
— ANI (@ANI) February 27, 2024