కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వరుసగా ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు.
కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో 'విభజన' ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
పని ఒత్తిడిని తగ్గించుకుని కొన్ని రోజులు అలా చిల్ అవుదామని అందరూ అనుకుంటుంటారు. మార్పులేని జీవనశైలి నుంచి తప్పించుకోవాలని కోరుకుంటారు. అల సుదూర ప్రాంతానికి వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని భావిస్తారు.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్లు విశ్వనీయ సమాచారం. అయితే ప్రధానితోనే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్ఎస్ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.