Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి తొలగించారని.. గతంలో సిద్ధం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ఓ గ్రూప్-1 అభ్యర్థి గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారో చెప్పాలని గ్రూప్-1 అభ్యర్థులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ఫలితాలు నిలిపివేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు. డిజిటల్ వాల్యూయేషన్ అంతా పారదర్శకంగానే జరిగిందని చెప్పారని.. కానీ ఇప్పుడు అభ్యర్థులనే మార్చి తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అర్హత లేనివారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐతో విచారణ చేయించి 202 మందికి న్యాయం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Chandrababu : ఆ నిబంధన రాష్ట్ర దుస్థితికి.. అసమర్థ పాలనకు నిదర్శనం
కాగా గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్‌ను కలవడానికి వచ్చిన సమయంలోనే రాజ్ భవన్‌కు ఏపీపీఎస్సీ అధికారి గౌతమ్ సవాంగ్ వచ్చారు. ఆయన యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రూప్-1 ఫలితాల విషయంలో తాజా పరిణామాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!