బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139 కోట్లకు పైగా అపహరణకు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో.. 73 ఏళ్ల లాలూ ప్రసాదవ్ యాదవ్‌ను ఫిబ్రవరిలో దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు.. శిక్ష కూడా విధించింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా లాలూ న్యాయవాది మాట్లాడుతూ… లాలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.. రూ. 10 లక్షల జరిమానా, రూ.1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు తెలిపారు..
Read Also: AB Venkateswara Rao: నేను లోకల్, ఎవ్వడినీ వదిలిపెట్టను.. ఏబీవీ వార్నింగ్..
ఈ కేసులో లాలూ తన ఐదేళ్ల శిక్షలో సగం అనుభవించాడని కోర్టుకు విన్నవించామన్న న్యాయవాది.. ఇప్పటికే 41 నెలల జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు.. ఇక, హైకోర్టు ఉత్తర్వులు మంగళవారం నాటికి దిగువ కోర్టుకు తెలియజేయబడతాయని, బెయిల్ బాండ్‌ను సమర్పించి విడుదల ఆర్డర్‌ను పొందుతామన్నారు.. కాగా, డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139 కోట్లకు పైగా ఎగనామం పెట్టిన ఐదో దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రికి రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష మరియు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజన్సీ పాటించలేకపోయిందని, మరికొంత సమయం కావాలని స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏప్రిల్ 8న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌కు తెలియజేసిన విషయం తెలిసిందే.