Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసు ముగిసింది. ఈ కేసును కోజ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ముగింపు నివేదికను కోర్టు అంగీకరించింది. నజీబ్ అహ్మద్ అక్టోబర్ 15, 2016 నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సీబీఐ నివేదికలో నజీబ్ మిస్సింగ్‌పై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని సీబీఐ పేర్కొంది.…
బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కొనసాగుతోన్న మిస్టరీ.. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురికాగా ఇంకా నిందితులు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..
CBI: నకిలీ భారత కరెన్సీ నోట్ల కేసులో ఎన్‌ఐఏకు కావలసిన నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ఇంటర్‌పోల్ చానెళ్ల ద్వారా విజయవంతంగా భారతదేశానికి తీసుకురావడంలో సీబీఐ కీలక పాత్ర పోషించింది. సీబీఐ ఇంటర్‌పోల్ అంతర్జాతీయ పోలీసు సహకార విభాగం (IPCU), అబూదాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB) సమన్వయంతో నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని జూన్ 20న భారత్‌కు రప్పించింది. అతను దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో ముంబయి…
బ్యాంకు జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. బ్యాంకు జాబ్ సాధించాలాని ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మీరు కూడా అలా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణలో 100, ఏపీలో 128 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన…
ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా…