Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ ఈ దేశానికి ఫ్యూచర్ అని, ఎవరు ఎంత మందో.. వారికి అంత వాటా అని తేల్చాలని రాహూల్ గాంధీ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కుల గణన నిస్పక్ష పాతంగా నిర్వహిస్తామని, రాహుల్ గాంధీని పిలిచాం వస్తా అన్నారని ఆయన తెలిపారు. నవంబర్ 5 లేదంటే 6 వ తేది రాహుల్ గాంధీని పిలుస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. హైకోర్టు సరిదిద్దుకోండి అంటే సరిదిద్దుకుంటామని,…
కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు.
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని, ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఎంఎస్‌పీ హామీ, కుల గణన వంటి వాగ్దానాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
RSS: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘కుల గణన’ అంశం ప్రముఖంగా నిలిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కులగణనకు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్ను వర్తింపచేస్తామని ఆయన చెప్పారు.