రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని మంత్రి పొన్నం ప్రభాకార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కులగణన సర్వేతో అంతా తెలిపోతుందా ? కులగణన తేలిపోయాక...స్థానిక సంస్థల ఎన్నికల వరకే అమలు చేస్తారా ? రాజకీయంగా ఆయా వర్గాలకు అవకాశాలు అంది వస్తాయా ? జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయిస్తారా ? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారని.. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలీ అనేది తమ విధానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐనా కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు.
Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు.
సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ…