దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Heart Attack: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి.
పాకిస్థాన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా (15) హఠాన్మరణం చెందాడు. 15 ఏళ్లకే నిండు నూరేళ్ల నిండిపోయాయి. తన సోదరుడు ఉమర్ షా గుండెపోటుతో చనిపోయినట్లుగా సోదరుడు, టిక్‌టాక్ స్టార్ అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు.
ఐఐటీ స్టూడెంట్ ఆకస్మిక మరణం.. తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులను షాక్ కు గురిచేసింది. తెల్లవారితే పరీక్ష ఉందని అర్థరాత్రి వరకు చదువుకున్న విద్యార్థి.. కానీ పరీక్షకు ముందే ఉదయం వేళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వారణాసిలోని IIT-BHUలో చోటుచేసుకుంది. MTech విద్యార్థి అనూప్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం పరీక్ష రాయాల్సి ఉంది. మంగళవారం రాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గదిలో చదువుకున్నాడు. ముగ్గురు తెల్లవారుజామున 3 గంటల వరకు…
జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా…
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
Heart Attack: ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది.
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది.
Cardiac Arrests: ప్రస్తుత రోజుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. ఇంతకుముందు ఈ సమస్య పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పడిపోయారని మీరు తరచుగా వినే ఉంటారు. అలాంటి వారు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ధమనులలో ఫలకం అడ్డుపడటం. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. శరీరంలో ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఈ…