ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ఉన్న భారత సంతతికి చెందిన వైద్యుడు ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
ఐ లవ్ యూ ‘రస్నా’ అనే యాడ్ గుర్తుకుందా.. ఓ ప్రముఖ పానీయం పేరు అది.. అయితే, ఇప్పుడు రస్నా వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా కన్నుమూశారు.. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించినట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది.. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల అరీజ్ పిరోజ్‌షా.. ఈ నెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారు.. ఆయనకి భార్య పెర్సిస్ మరియు పిల్లలు పిరుజ్, డెల్నా మరియు రుజాన్.. కోడలు బినైషా మరియు మనవళ్లు అర్జీన్,…
Many crushed to death, dozens in cardiac arrest after Halloween stampede in Seoul: దక్షిణ కొరియాలో హాలోవీన్ ఉత్సవాలు తొక్కసలాటకు కారణం అయ్యాయి. రాజధాని సియోల్ లోని ఓ ఇరుకు వీధిలోకి ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మంది వరకు గాయపడ్డారు. అయితే జనాల తొక్కిసలాట, ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో చాలా మంది ప్రజలు భయపడిపోయారు. దాదాపుగా 50 మందికి గుండె…
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఉదయం జిమ చేస్తుండగా గుండెపోటు వచ్చిందని.. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అతను జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు.
మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని సావ్నర్ అనే పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలితో శృంగారం చేస్తూ అజయ్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఆమెతో కలిసి లాడ్జికి వెళ్లిన అతడు.. సెక్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో ప్రియురాలు లాడ్జీ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే అజయ్ చనిపోయినట్లు లాడ్జీ సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సంబంధిత సమస్యతో చనిపోయినట్లు నిర్ధారించారు.…
తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. విజయవాడ టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం గుండె నొప్పితో ప్రయివేట్ ఆసుపత్రి లో చేరిన బాబుకి వైద్యం అందించారు. కానీ సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు. గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు…
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సురేఖ సిక్రీ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ముంబైలో ఉంటున్న సురేఖ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. 2018 నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇలా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నేడు గుండెపోటు వచ్చింది. సురేఖ సిక్రీ ప్రసిద్ధ టీవీ సీరియల్ “బాలికా వధు”తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఏ సీరియల్ తెలుగులో “చిన్నారి పెళ్ళి కూతురు”…