హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలు కారులో ఇరుకుపోవడంతో గడ్డపారసాయంతో బయటికి తీశారు పోలీసులు.
Also Read:Iran-Israel: మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
మరో 100 మీటర్ల దూరం ప్రయాణిస్తే ఇంటికి చేరుకునే వారు. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చేతికి అందివచ్చిన కొడుకులు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ముల కొడుకులు వర్షిత్, త్రినాధ్ లు చనిపోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.