నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని పోలీసులు చెబుతున్నారు.
Also Read:RCB: ఈ సాల కప్ నమ్దే.. కోహ్లీకి కలిసొచ్చిన జెర్సీ నెంబర్ 18
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి ఢీ వైడర్ ను ఢీ కొట్టింది. గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ వైపు తమ రూట్ లో వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు. ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.