Four Kids Die: విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్ కాకవడంతో అందులో చిక్కుకున్నారు.. ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడకపోవడంతో.. విలవిలలాడి కన్నుమూశారు.. ఊర్లో జరుగుతోన్న శుభకార్యంలో అందరూ ఉండిపోవడంతో గుర్తించ లేకపోయామని చెబుతున్నారు. కళ్ల ముందు తిరిగాడే చిన్నారు లేరన్న విషయాన్ని జీర్ణించుకో లేకపోతున్నారు గ్రామస్తులు.
Read Also: Astrology: మే 19, సోమవారం దినఫలాలు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆట ఆడుకుంటూ కారులో దూరి డోర్ లాక్ ఆవ్వడంతో ద్వారపూడిలో నలుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు అన్నా చెల్లిళ్ల పిల్లలే. దీంతో ఆ కుటుంబ సభ్యల రోదనకు అవధులు లేవు. బుచ్చునాయుడు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్ మూడో తరగతికి వచ్చాడు. బుచ్చునాయుడు విజయనగరం మార్కెట్ లో పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఉదయ్ క్రీడలలో చిరుకుగా ఉంటాడేవాడు. ఊర్లో కూడా అందరితో కలిసి మెలసి ఉండేవాడు. ఇటీవల వేసవి క్రీడా శిబిరంలో భాగంగా బాక్సింగ్ శిక్షణలో చేరాడు. ఎప్పటికైనా బాక్సర్ అవుతానని అందితో చెబుతుండేవాడని చెబుతూ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.. ఇంతలోనే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడని దంపతులు గుండెలు బాధుకుంటున్నారు. ఇక, బుచ్చునాయుడు సోదరి అరుణ, ఆమె భర్త సురేష్ సమీపంలోనే నివసిస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె మనస్విని ఉంది. సురేష్ భవన నిర్మాణ కార్మికుడు. భార్య గృహిణి. మనస్వనీ వీరికి ఒక్కగాని ఒక్క పాప.. అందుకే పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పాప ఇక లేదన్న విషయం తెలిసి ఆ తండ్రి రోదన చుట్టు పక్క వారి అందర్నీ కంటతడి పెట్టించింది.