Telangana Elections 2023: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల టెలీ ప్రచారం కూడా జోరందుకుంది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ తరహా ప్రచారం తగ్గినా ఈసారి మళ్లీ ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు చేస్తున్నారు. వారి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా ఆధారంగా వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించారు. వీటి ద్వారా ఓటర్లను నేరుగా పలకరిస్తారు. హలో, నేను మీ అభ్యర్థిని. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను..
ఎన్నికల ప్రచారం కోసం “ఈయన మీ అభ్యర్థి” SMS కూడా ఉపయోగించబడుతోంది. పోన్ కాల్ కాకుండా ఎస్ఎంఎస్ లు కూడా చేస్తున్నారు. కొందరు ఎన్నికల ప్రచారం, పాదయాత్ర, రోడ్ షో లతో ప్రజలను ఆకట్టుకుంటుంటే మరొకొందరు ఫోన్ కాల్, ఎస్ఎంఎస్ లతో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు కరోనా కాలంలో ఇలాంటి ఫోల్ కాల్ వినే ఉంటాము. కానీ.. ఇప్పుడు తతెలంగాణ పోలింగ్ దగ్గర పడుతుండటంతో నేతలు ఇలాంటి ఐడియాలను ఉపయోగించుకుంటూ ఓటర్లను తమ వైపు మళ్లించుకుంటున్నారు. దీంతో టెలీ ప్రచారంలో అభ్యర్థుల పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
అయితే ఈ ప్రచారం కోసం ఎన్నికల సంఘం ఒక్కో ఎస్ఎంఎస్‌కు గరిష్టంగా ఆంగ్లంలో 160 పదాలు, తెలుగులో 70 పదాలను అనుమతించింది. ఈ కాల్స్ సమయంలో ఓటర్లు మాట్లాడలేరు. రికార్డ్ చేయబడిన అభ్యర్థి వాయిస్‌తో మాత్రమే ప్రచార సందేశం ప్లే చేయబడుతుంది. అయితే నియోజకవర్గంలోని అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు రాష్ట్ర, జాతీయ పార్టీల అభ్యర్థుల నుంచి రోజుకో కాల్స్ రావడంతో కొందరు ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు. అభ్యర్థులకు మన వ్యక్తిగత సమాచారం, ఫోన్ నంబర్లు ఎలా చేరాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ ప్రాంత ఓటర్లే కాకుండా ఇతర వ్యక్తుల వద్దకు కూడా వెళ్తున్నారు. హైదరాబాద్ వాసులకు చాలా వరకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లపైనే కాల్స్ వస్తున్నాయి. ఓటరు కార్డులో చిరునామా మారిపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
Nandamuri Balakrishna: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!