సినీ నటి జయా బచ్చన్‌కు (Jaya Bachchan) మరోసారి రాజ్యసభ సీటు దక్కింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఆమె పేరును ప్రకటించింది. జయా బచ్చన్ (75 )తో పాటు మరో ఇద్దరి పేర్లను ఎస్పీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్ (Alok Ranjan), దళిత నేత రామ్‌జీ లాల్ సుమన్‌లను (Ramji Lal Suman) ప్రకటించింది
రంజన్(67) ఐఐఎం పూర్వ విద్యార్థి.. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. కాగా సుమన్ నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈసారి మాత్రం రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే ఈనెల 9న రాజ్యసభలో జరిగిన వీడ్కోలు ప్రసంగంలో జయా బచ్చన్ (Jaya Bachchan) కీలక ప్రసంగం చేశారు. తనకు కోపం ఎక్కువని.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. అయినా తనకు ఎవరినీ గాయపరిచే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఇకపోతే బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై ఆమె ఫైరయ్యారు.