Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పీడ్ పెంచారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని…
Cabinet Announces Bonus For Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్‌ఎఫ్ సిబ్బందిని మినహాయించి నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించబడతాయి.
CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన పలువురు మంత్రుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా.. మంత్రులు స్పందించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి వెనకాడనని…
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2022కు ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. అయితే తమకు ఇదే చివరి కేబినెట్ సమావేశమా? అని కొందరు మంత్రులు అడగ్గా.. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని జగన్ స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే కాగా, ఆ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జగన్.. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనే ఉండాలని స్పష్టం చేశారాయన.. ఇక, త్వరలోనే వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు జరుగుతుండగానే వైఎస్సార్ సీఎల్పీ భేటీ ఉంటుందని తెలిపారు సీఎం జగన్… గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అనంతరం…