Cabinet meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet meeting: రాష్ట్ర మంత్రివర్గం భేటి ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలు చర్చించి కేబినెట్ ఆమోదించింది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపింది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై చర్చించిన సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేశారు. ఇక, పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్లు సమాచారం కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి నాందేడ్ కు పయనం కానున్నారు. BRS బహిరంగ సభలో పాల్గొన నున్నారు కేసీఆర్.
Read also: Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Also Read
సీఎం కేసీఆర్ నాందేడ్ రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణం అంతా ముస్తాబైంది. కేసీఆర్ ప్రసంగంతో నాందేడ్ దద్దరిల్లనుంది. కేసీఆర్ రాకకోసం నాందేడ్ గులాబీ మాయం అయింది. మరాఠీ భాషలో భారీగా బ్యానర్లు, హోర్డింగ్ లు దర్శనమిస్తున్నాయి. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో సభా వేదిక అందంగా ముస్తాబైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, నలు దిశలా, ఎయిర్‌పోర్ట్ నుంచి సభా వేదిక వరకు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సభా వేదికతోపాటు, పార్కింగ్, మీడియా గ్యాలరీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మందికిపైగా కూర్చునేందుకు వీలుగా టెంట్‌ను వేశారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!