ఈనెల 3న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని మార్చి 7వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మొదట చర్చ సాగింది.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ తాజా పరిస్థితి, మహమ్మారి విజృంభిస్తే.. ఎదుర్కోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో…
ఇవాళ ఏపి కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం కానుంది మంత్రి మండలి. పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం ఉంది. ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మకాలకు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపింది.…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది.. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ఈ సమావేశంలో చర్చించనున్న అంశాలను పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మకాలకు వీలు కల్పించేలా ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలపనుంది.. ఇక, వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అసెంబ్లీ సమావేశాల…
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వెలిగ పూడిలోని సచివాలయంలో సమావేశం కానుంది మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, టీడీపీ నేతల భాషపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, వచ్చేవారం ఢిల్లీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో.. పోటీగా వైసీపీ నేతలు కూడా హస్తిన బాట పట్టనున్నట్టు…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కెబినెట్ భేటీ జరగనుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై కెబినెట్లో ప్రతిపాదనలు పెట్టనున్నారు. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చించనుంది రాష్ట్ర మంత్రి వర్గం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై ఈ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో…
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్ వాచ్! ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం? ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్…
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.…