Sugarcane : రైతుల ఉద్యమాల నడుమ, ఎన్నికల ముందు దేశంలోని ఐదు కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఈ ఐదు కోట్ల మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నవారే తప్ప మరెవరో కాదు.
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా…
నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 17 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేస్తుంది.. తద్వారా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనిపై కూడా నేటి మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నట్లుల తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దల సమక్షంలో తెలంగాణకు రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను వెల్లడించారు. 6 గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వాటి అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారని.. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు…
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
Telangana Cabinet: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు.