Indian Aviation Sector: దేశీయ విమానయాన రంగంలో 2వ స్థానాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ ఎదిగింది. 10.4 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 58.8 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది.
Dmart Plans: ఇండియన్ రిటైల్ కార్పొరేషన్ డీమార్ట్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రిలయెన్స్ రిటైల్‌కి పోటీగా ప్లాన్లు వేస్తోంది. స్టోర్ల సంఖ్యను భారీగా పెంచటంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టోర్ల సంఖ్య 284 కాగా వాటిని 1500కు పెంచేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Sensex crosses 60,000 mark: మన దేశ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 30 రోజులుగా ర్యాలీ కొనసాగుతోంది. గత నాలుగు నెలల్లో తొలిసారిగా ఇవాళ సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటడం ఇదే మొదటిసారి.
Snapchat plus: అమెరికన్ కెమెరా అండ్ సోషల్ మీడియా కంపెనీ స్నాప్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఆ సంస్థ ప్రారంభించిన ప్రీమియం సర్వీస్ స్నాప్‌చాట్ ప్లస్‌కి యూజర్ల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఆరు వారాల కిందట మాత్రమే ఆరంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌ను అతి తక్కువ కాలంలో
Global Vehicle Sales: ప్రపంచంలోని మొత్తం వాహన విక్రయాల్లో దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ తనదైన ముద్ర వేసింది. తాజాగా మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల ఫలితాలు వెల్లడించింది. ఆటోమోటివ్ చిప్ కొరత ఉన్నా అమ్మకాల్లో భేష్ అని నిరూపించుకోవటం విశేషం.
Russia will buy Rupees: డాలర్లను, యూరోలను కొనే పరిస్థితి లేకపోవటంతో మిత్ర దేశాల కరెన్సీలను కొనాలని రష్యా భావిస్తోంది. ఇండియా, చైనా, టర్కీ కరెన్సీలైన రూపాయి, యువాన్, టర్కిష్ లిరాలను కొనుగోలు చేయాలనుకుంటోంది. నేషనల్ వెల్త్ ఫండ్ (ఎన్‌డబ్ల్యూఎఫ్) కోసం ఈ నిధులను
Ukraine in Top: రష్యా దురాక్రమణతో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ టాప్‌లో నిలవటమేంటి, అసలు ఆ దేశం ఎందులో టాప్‌లో నిలిచిందని అనుకుంటున్నారా?. నమ్మబుద్ధి కాని నిజమిది. డిజిటల్ కరెన్సీలో ఉక్రెయిన్ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2021లో ఆ దేశంలో 12.7 శాతం మంది వద్ద ఇ-నగదు ఉంది.
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్‌లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం
India Economy: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా నిలవనుంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గ్రోత్ సగటున ఏడు శాతానికి చేరుతుంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బలమైన ఎకానమీగా ఇండియా
Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ వేతనం తీసుకోలేదు. 2020లో కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆయన