Dmart Plans: ఇండియన్ రిటైల్ కార్పొరేషన్ డీమార్ట్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రిలయెన్స్ రిటైల్‌కి పోటీగా ప్లాన్లు వేస్తోంది. స్టోర్ల సంఖ్యను భారీగా పెంచటంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టోర్ల సంఖ్య 284 కాగా వాటిని 1500కు పెంచేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు డీమార్ట్ సీఈఓ నెవిల్లె నొరొన్హా వెల్లడించారు. అయితే.. ఈ విస్తరణ ప్రణాళికను ఎప్పటిలోగా, ఎంత పెట్టుబడితో చేపడతామనే వివరాలను స్పష్టం చేయలేదు. పోటీ ప్రపంచంలో రానున్న 20 ఏళ్లపాటు తమకు ఎలాంటి ఆందోళనా లేదని ధీమా వ్యక్తం చేశారు.
క్యూ కట్టిన ఐపీఓలు
ఈ ఏడాది ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) వద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓలు) క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో రూ.52 వేల కోట్ల విలువైన ఐపీఓలు ఉన్నాయి. 46 సంస్థలు ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్‌లను సమర్పించాయి. ఈ నెలలో 15వ తేదీ నాటికే 7 సంస్థలు ముందుకు రావటం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొనటంతో ఐపీఓలు వెనక్కి తిరిగొస్తున్నాయి. సెబీ, యాంజెల్ వన్, బిజినెస్ ఇన్‌సైడర్ ఇండియా ఈ వివరాలను వెల్లడించాయి.
Rakesh Jhunjhunwala: కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
‘టాటా’కి పెద్ద ఆర్డర్
టాటా మోటర్స్‌కి పెద్ద ఆర్డర్ వచ్చింది. 921 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం బీఎంటీసీ ఈ ఆర్డర్ ఇచ్చింది. బీఎంటీసీ అంటే.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్. 12 మీటర్ల పొడవైన ఈ బస్సులను 12 ఏళ్లపాటు తయారుచేసి అందించటం, ఆపరేట్ చేయటం, మెయింటనెన్స్ చూసుకోవటం వంటి బాధ్యతలను టాటా మోటార్స్ చూసుకోవాలి. ఈ మేరకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లలో నిన్నటి ఆనందం ఆవిరైంది. ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు మాత్రమే పెరిగి 60298 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17956 పైనే క్లోజ్ అయింది. ఇంట్రాడేలో సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ షేర్లు 6% నష్టపోయాయి. ఎస్‌బీఐ లైఫ్ స్టాక్స్ కొత్త శిఖరానికి చేరుకున్నాయి. 2 నెలల్లో 24 శాతం ర్యాలీ తీసింది. రూపాయి మారకం విలువ 19 పైసలు కోల్పోయి ప్రస్తుతం 79.25 వద్ద నిలకడగా ఉంది.