Russia will buy Rupees: డాలర్లను, యూరోలను కొనే పరిస్థితి లేకపోవటంతో మిత్ర దేశాల కరెన్సీలను కొనాలని రష్యా భావిస్తోంది. ఇండియా, చైనా, టర్కీ కరెన్సీలైన రూపాయి, యువాన్, టర్కిష్ లిరాలను కొనుగోలు చేయాలనుకుంటోంది. నేషనల్ వెల్త్ ఫండ్ (ఎన్‌డబ్ల్యూఎఫ్) కోసం ఈ నిధులను సమీకరించాలని చూస్తోంది. ఈ మేరకు రష్యా సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
‘ఆదిత్య బిర్లా’లోకి ‘అబుదబి’ పెట్టుబడి
మన దేశానికి చెందిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అబుదబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి వాటా దక్కనుంది. రూ.665 కోట్ల పెట్టుబడికి 9.99% షేర్‌ను సొంతం చేసుకోనుంది. ఈ మూలధనంతో సంస్థ వృద్ధిపై మరింతగా దృష్టిసారించాలని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. మన దేశ ఆరోగ్య బీమా రంగంలో పురోగతికి విస్తృత అవకాశాలు ఉండటంతో అబుదబి ఇటు ఫోకస్ పెట్టింది. ప్రజల్లో అవగాహన, ఆర్థిక పురోగతికి అనుకూల వాతావరణం ఉండటం వల్ల ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ తాజా ఇన్వెస్ట్మెంట్ అనంతరం ఆదిత్య బిర్లా వాటా 45.91 శాతానికి తగ్గిపోతుంది. మూమెన్‌టమ్ మెట్రోపాలిటన్ హోల్డింగ్స్ షేరు 44.10 శాతంగా ఉంటుంది. అబుదబి సంస్థ మూడో భాగస్వామి కానుంది.
Telangana Voice: గెలిచిన తెలంగాణ వాదన. వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం
ఆడి క్యూ3కి ప్రి-బుకింగ్స్
జర్మనీకి చెందిన ఆడి కార్ల కంపెనీ నుంచి కొత్త మోడల్ కారు మన దేశ మార్కెట్‌లోకి వచ్చే నెలలో రాబోతోంది. క్యూ3 అనే ఆ న్యూ మోడల్ కార్ల కోసం ప్రి-బుకింగ్స్ ఆరంభమయ్యాయి. బ్రాండ్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోనే ఈ బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ బుకింగ్ కోసం రూ.2 లక్షలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రీమియం ఎస్‌యూవీలు మాత్రమే ప్రి-బుకింగ్‌కి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈ ఏడాది చివరి నాటికి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది.