తెలంగాణ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి… పేరు గొప్ప.. ఊరు దిబ్బలా బడ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేసిన ఆమె.. బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆమె.. ఎన్నికలను దృష్టిలో…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు…
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై…
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్ అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఊరట కలిగించే వార్తను అందించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర…
కేంద్ర బడ్జెట్ 2022-2023లో రక్షణ రంగానికి భారీగా నిధులను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సైనికదళాల అవసరాల కోసం కేంద్రం 5.25 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మూలధన కేటాయింపులను 12.82 శాతంగా పెంచి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, ఈసారి వాయుసేన, ఆర్మీకంటే నేవీకి అధికంగా నిధులను కేటాయించారు. గతేడాది కంటే ఈసారి నేవీకి 43 శాతం మేర నిధులు పెరిగాయి. వాయుసేనకు 4.5 శాతం కేటాయింపుల్లో పెరుగుదల కనిపించగా, ఆర్మీకి…
2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ…
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా సీఐఐ మాజీ అధ్యక్షడు రామకృష్ణ బడ్జెట్ పై మాట్లాడారు. ఇది చాలా మంచి బడ్జెట్ అన్నారు. పన్నుల్లో పెద్దగా మార్పులు లేవన్నారు. మౌళిక, రవాణా రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాల మొత్తాలను పారిశ్రామిక అభివృద్ధిపై పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పరిశ్రమలకు నిధులు ముఖ్యమన్నారు. డిజిటల్ ఎడ్యూకేషన్‌కు…
నిర్మలమ్మ బడ్జెట్లో ఊరట కలిగించే అంశం ఏదైనా వుందంటే అది గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడమే అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న ఈ సిలిండిర్ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ ధర తరచూ…
పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఇవాళే ప్రారంభం అయ్యాయి.. రేపు 2022-23 వార్షిక బడ్జెట్ను మంగళవారం రోజు పార్లమెంట్ ముందుకు రాబోతోంది.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ప్రీ బడ్జెట్ డిమాండ్స్ పేరుతో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ ఒక నివేదిక విడుదల చేసింది.. బడ్జెట్ ఎలా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు..? అనే దానిపై అధ్యయనం నిర్వహించిన ఆ సంస్థ.. తాజాగా, నివేదికను బయటపెట్టింది.. అయితే, ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు,…